‘బంగ్లాదేశ్‌ తర్వాత మా టార్గెట్‌ భారత్‌!’

సిడ్నీ: స్వదేశంలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేయండంపై టెస్టు సారథి టిమ్‌ పైన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింటలతో టీమిండియా(360) తరువాతి స్థానంలో ఉంది. అయితే మ్యాచ్‌ అనంతరం టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో టీమిండియతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తన్నుట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా భారత్‌-ఆసీస్‌ సిరీస్‌ అంటేనే అటు ఆటగాళ్లకు ఇటు అభిమానులకు నోరూరించే సిరీస్‌ అని అభివర్ణించాడు.